సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

CBSE Class 12 date sheet revised, new exam schedule

న్యూఢిల్లీః సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌రీక్ష‌ల టైం టేబుల్‌లో స్వ‌ల్ప మార్పు చోటు చేసుకుంది. 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు సంబంధించి ఏప్రిల్ 4వ తేదీన జ‌ర‌గాల్సిన ఎగ్జామ్‌ను మార్చి 27నే నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీబీఎస్ఈ ప్ర‌క‌టించింది. మిగ‌తా ప‌రీక్ష‌ల తేదీల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు 29వ తేదీన ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌ర‌గ‌నున్నాయి.

సీబీఎస్ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 15న ప్రారంభ‌మై మార్చి 21వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఇక 12వ త‌ర‌గ‌తి ఎగ్జామ్స్ ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తి రోజు ఉద‌యం 10:30 గంట‌ల‌కు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/