అయోధ్య ఆలయానికి తొలి రోజు రూ.3.17 కోట్ల విరాళాలు అందజేసిన భక్తులు

అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కల నెరవేరడం తో రామయ్య చూసేందుకు దేశ నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్య లో అయోధ్య కు వచ్చి బాల రాముడ్ని దర్శించుకుంటున్నారు.

రెండో రోజు బాల రాముడిని 2.5 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్టు తెలిపింది. మరోవైపు తొలి రోజున భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలు సమర్పించినట్లు వెల్లడించింది. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆలయంలో 10 హుండీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తొలి రోజు 5 లక్షల మందికి పైగా భక్తులు రామయ్యను దర్శించుకున్న సంగతి తెలిసిందే.

ఇక రాముడి దర్శనం సమయాన్ని పొడిగిస్తూ పరిపాలన విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు రాత్రి 7:00 గంటలకు బదులుగా రాత్రి 10:00 గంటల వరకు రామ్ లల్లా దర్శనం చేసుకోవచ్చు. ఉదయం పూట దర్శనాలు ఉదయం 7 నుండి 11.30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది అని తెలిపారు.

సోమవారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు , వేలాదిమంది ప్రముఖులు హాజరయ్యారు.