ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 31 లక్షలు దాటిన కరోనా కేసులు

8 లక్షలు మించిన మరణాలు

Corona cases crossed 2 crore 31 lakhs worldwide
Corona cases crossed 2 crore 31 lakhs worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 2 కోట్ల 31లక్షల 17వేల 913కు చేరింది.

అలాగే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 8లక్షల 3వేల 200కు పెరిగింది.

అమెరికా, బ్రెజిల్, ఇండియాలలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/