ఢిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందులోభాగంగా సీఎం కేసీఆర్‌ ఢిల్లీ బయలుదేరారు. బేగంపేటలోని ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయణమయ్యారు. మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు.

అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు ఢిల్లీకి బయలుదేరారు.

ఇక బీఆర్‌ఎస్‌ కార్యాలయ ప్రత్యేకతలు చూస్తే..

నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్‌ఎస్‌భవన్‌ నిర్మాణం.
లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్‌, సర్వెంట్‌ క్వార్టర్స్‌.
గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్‌, రిసెప్షన్‌ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు.
మొదటి అంతస్థులో బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ చాంబర్‌, ఇతర చాంబర్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్స్‌.
2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు. వీటిలో పార్టీ ప్రెసిడెంట్‌ సూట్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూట్‌పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.