మంత్రి మల్లారెడ్డిపై దాడి సరికాదు : మంత్రి తలసాని

TS Minister Talasani Srinivasa Yadav
minister-talasani-respond-on-minister-malla reddy-attack

హైదరాబాద్: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగిన ‘రెడ్ల సింహగర్జన’ సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంత్రి మల్లారెడ్డిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. మంత్రి ఎం మాట్లాడాలో కూడా వాళ్లే చెప్తారా అని ప్రశ్నించారు. మల్లారెడ్డి ఈ ప్రభుత్వం ఎం చేసిందో చెప్పే ప్రయత్నం చేశారని తెలిపారు. కార్పొరేషన్ పెడుతున్నాం అని ఒక ముక్క చెప్పి వెళ్లిపోవాలా అని అడిగారు. వయసురీత్యా కూడా మంత్రి మల్లారెడ్డికి మర్యాద ఇవ్వాలని సూచించారు. ఒక బాధ్యత కలిగిన మంత్రిపై వారు వ్యవహరించిన తీరు సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/