చిరంజీవి వాచ్ ..నా జీవితాన్ని మార్చేసింది – దేవి శ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య దేవి హావ తగ్గింది కానీ రెండేళ్ల క్రితం వరకు దేవి హవానే నడిచింది. రీసెంట్ గా పుష్ప తో మళ్లీ తన హావ మొదలుపెట్టిన దేవి..తాజాగా చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య చిత్రానికి మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ మూవీ లోని సాంగ్స్ శ్రోతలకు , మెగా అభిమానులకు ఎంతగానో నచ్చాయి. జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలతో బిజీ బిజీ గా ఉన్నారు.

తాజాగా డైరెక్టర్ బాబీ తో కలిసి దేవి శ్రీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో తన చిన్నప్పుడు చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ గురించి ప్రస్తావించారు. “చిరంజీవిగారి చాలా సినిమాలకు మా ఫాదర్ సత్యమూర్తిగారు రచయితగా పనిచేశారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. అప్పుడు నా స్కూల్ డేస్ నడుస్తున్నాయి. ఒక రోజున నాకున్న మ్యూజిక్ సెన్స్ గురించి మా నాన్నగారి ద్వారా తెలుసుకున్న చిరంజీవిగారు, నన్ను చూడాలని ముచ్చటపడ్డారు. నన్ను తీసుకుని వస్తానని మా ఫాదర్ అంటే, ‘లేదు తనని చూడటానికి నేనే వస్తాను’ అంటూ అల్లు అరవింద్ గారితో కలిసి మా ఇంటికి వచ్చారు.

నేను మ్యూజిక్ ను ప్లే చేస్తూ ఉంటే, ఆయన చాలా సంతోషంగా ఆలా ఉండిపోయారు. ‘నేను సరదాగా చూద్దామని వచ్చాను .. అందువలన గిఫ్ట్ ఏమీ తీసుకురాలేదు .. ఇదిగో నీకు గిఫ్టుగా నా ఫేవరేట్ వాచ్ ఇస్తున్నాను” అంటూ తన చేతికి ఉన్న ఖరీదైన ప్లాటినం వాచ్ ను తీసి నా చేతికి పెట్టారు. నిజం చెప్పాలంటే ఆయన అలా నా చేతికి వాచ్ పెట్టిన దగ్గర నుంచే నా టైమ్ మారిపోయింది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక వాల్తేర్ వీరయ్య మూవీ లో చిరు తో పాటు ఓ కీలక పాత్రలో రవితేజ నటించాడు. హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా , మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.