‘దేవర’ యాక్షన్ పూర్తి.. పాటలపై ఫోకస్

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ మూవీ దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. ప్రస్తుతం ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో టాకీ, పాటల షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

హీరో హీరోయిన్ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుందని టాలీవుడ్ టాక్. గోవా, కొచ్చిలో కొన్ని అద్భుతమైన లోకేషన్సు మూవీ యూనిట్ పరిశీలించిందట. గతంలో కొరటాల శివ- ఎన్టీఆర్ కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి సూపర్ సక్సెస్ కావడం తో దేవర ఫై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 10 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.