పార్టీ ఇంఛార్జ్ ముందే ..రేవంత్ ఫై పరోక్షంగా అసహనం వ్యక్తం చేసిన ఉత్తమ్

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ కు పగ్గాలు వచ్చినప్పటి నుండి సీనియర్ నేతలు కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. పైకి తిరుగుతున్నప్పటికీ..లోలోపల మాత్రం ఇప్పుడు వచ్చిన రేవంత్ కు పదవి ఇవ్వడం ఏంటి అని కోపంగా ఉన్నారు. ఇప్పటివరకు బయటకు కోమటిరెడ్డి మాత్రమే కనిపించగా..తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పరోక్షంగా రేవంత్ ఫై అసహనం వ్యక్తం చేసారు.

సోమవారం గాంధీ భవన్ కు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వచ్చారు. పలు విషయాల ఫై చర్చలు జరుపగా..కాంగ్రెస్ పార్టీని పార్టీలాగా నడిపించాలని ఠాకూర్‌కు విజ్ఞప్తి చేశారు ఉత్తమ్. ఒక్కరి మైలేజ్ కోసం కాకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని పరోక్షంగా రేవంత్ ఫై అసహనం వ్యక్తం చేసారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంలో కొత్త కార్యవర్గం విఫలమైందని అన్నారు. ఉత్తమ్ మాటలను విన్న మాణిక్యం ఠాగూర్.. ఇక నుంచి అలా కాకుండా చూస్తానని ఆయనకు తెలిపారు. పార్టీ లైన్ లోనే నాయకులు పనిచేయాలని రేవంత్‌కు దిశానిర్దేశం చేశారు.