ఢిల్లీలో శాంతియుత ర్యాలీలో పాల్గొన్న కపిల్ మిశ్రా

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై విమర్శలు ఎదుర్కొంటున్న వివాదస్పద నేత కపిల్ మిశ్రా ఓ శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయనతో పాటు
బిజెపి పార్టీకి చెందిన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి శుక్రవారమే సోషల్ మీడియా ద్వారా కపిల్ మిశ్రా పిలుపునిచ్చారు. మిత్రులారా, రేపు జంతర్ మంతర్‌కు మీరందరూ తప్పకుండా రావాలి. ఎందుకంటే నిజాన్ని చెప్పడం ఇప్పుడు ఎంతో అవసరం అని ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు కపిల్ మిశ్రా. చేతిలో జాతీయ జెండాతో జంతర్ మంతర్ వద్ద ఆయన సందడి చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/