మూడు రాజధానుల చట్టాన్ని జగన్ సర్కార్ వెనక్కు తీసుకోవడంఫై రఘురామ స్పందన

మూడు రాజధానుల చట్టాన్ని జగన్ సర్కార్ వెనక్కు తీసుకోవడంపై ఏపీ వ్యాప్తంగా అంత సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ సర్కార్ ఎప్పుడైతే మూడు రాజధానులను ప్రకటించిందో..అప్పటి నుండి అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. దాదాపు 700 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో మూడు రాజధానుల చట్టాలను ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ సోమవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఏజీ ప్రతిపాదనను విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు నిర్ణయాల్ని ఏపీ కేబినెట్‌ వెనక్కి తీసుకుంది. సీఎం జగన్ కాసేపట్లో అసెంబ్లీలో మూడు రాజధానుల నిర్ణయం గురించి ప్రకటన చేయనున్నారు.

జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై నరసాపురం ఎంపీ రఘురామ స్పందించారు. అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, రైతు సోదరులకు, పర్యవేక్షణ కమిటీ నిర్వాహకులకు మహిళా సంఘాలు, సమర్ధించిన అందరికీ చెందుతుంది. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన నిర్ణయం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అన్నారు. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచానని రఘురామ అన్నారు. మూడు కాదు రెండు అని అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా గత ప్రభుత్వం ఏదైతే ఎలా చేయాలనుకున్నారో అలా చేయాలని.. లేదంటే దానికంటే మెరుగ్గా రాజధాని నిర్ణయం ప్రకటించాలన్నారు.