ఉత్తరప్రదేశ్‌ వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి

రైతుల ఆదాయం పెంచేందుకు 10,000 ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేశాము

narendra modi
narendra modi

చిత్రకూట్‌: బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రైస్‌వేతో ఉత్తరప్రదేశ్ వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్థానికులకు పెద్ద నగరాలతో అనుసంధానానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రూ.15,000 కోట్లతో నిర్మించే బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేతో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలకు చేకూరుతాయని శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. అంతకుముందు, బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకు మోదీ శంకుస్థాపన చేశారు. 10,000 ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓలు) ప్రారంభించారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రధాని వివరిస్తూ, దేశవ్యాప్తంగా రైతుల ఆదాయం పెంచేదుకు 10,000 ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించడం, సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వడం, యూరియాపై 100 శాతం నీమ్ కోటింగ్, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/