రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన రజనీకాంత్ దంపతులు

మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి, ప్రధానిలను కలుసుకున్న రజనీ

న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీకాంత్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు ఆయన తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. 25వ తేదీన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని స్వీకరించారు. ఈరోజు ఆయన తన అర్ధాంగి లతతో కలిసి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ లను కలిశారు. మర్యాదపూర్వకంగా వీరి సమావేశం జరిగింది.

కాగా, ఈ రెండు సంద‌ర్భాల‌కు సంబంధించిన ఫొటోల‌ను ర‌జినీకాంత్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను, ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ ని క‌లిసి వారి ఆశీస్సులు తీసుకోవ‌డం, అభినంద‌న‌లు పొంద‌డం చాలా ఆనందంగా ఉన్న‌ద‌ని ర‌జీనికాంత్ త‌న ట్విట్ట‌ర్ పోస్టుకు ఒక క్యాప్ష‌న్ జ‌తచేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/