గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారంః సీఎం జగన్

cm-jagan-announces-rs-20-lakh-ex gratia-for-geetanjali-family

అమరావతిః తెనాలి యువతి గీతాంజలి విపక్షాల ట్రోలింగ్ కారణంగానే బలవన్మరణం చెందిందంటూ అధికార వైఎస్‌ఆర్‌సిపి తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. తాజాగా, ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. గీతాంజలి ఆత్మహత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్ఠలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్ హెచ్చరించారు.