బిపిన్ రావ‌త్ దంప‌తుల‌కు మ‌తపెద్ద‌ల నివాళులు

న్యూఢిల్లీ : హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన భార‌త సీడీఎస్ జ‌న‌ర‌ల్‌ బిపిన్ రావ‌త్‌కు వివిధ మ‌తాల‌కు చెందిన పెద్ద‌లు ఘ‌నంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావ‌త్ దంప‌తుల భౌతిక కాయాల‌పై పుష్ప‌గుఛ్చాలుంచి అంజ‌లి ఘ‌టించారు. అనంత‌రం ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. రెండు రోజుల క్రితం త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో కూనూరు స‌మీపంలో మిలిట‌రీ హెలిక్యాప్ట‌ర్ కూలిపోయి మంట‌ల్లో చిక్కుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బిపిన్ రావ‌త్ దంప‌తులు స‌హా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/