కమిటీ ఏ నివేదికా ఇవ్వలేదు..మనీశ్ సిసోడియా

అది బీజేపీ ఆఫీసులో బీజేపీ నేతలు తయారుచేసిన నివేదిక

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆక్సిజన్ ఆడిట్ నివేదికపై మండిపడ్డారు. సుప్రీం కోర్టు కమిటీ ఇచ్చిందని చెబుతున్న ఆ నివేదిక అసలు లేనే లేదు అని విమర్శించారు. అవసరానికి మించి ఢిల్లీ ప్రభుత్వం 4 రెట్ల ఆక్సిజన్ ను తీసుకుందని సుప్రీం కోర్టు నియమించిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన దానిపై వివరణ ఇచ్చారు.

ఏ నివేదికపైనా ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సంతకం చేయలేదని, అలాంటప్పుడు ఈ నివేదిక ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తాము ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సభ్యులతో మాట్లాడామన్నారు. ఆడిట్ కమిటీ నివేదిక ఇవ్వలేదని, ఈ నివేదిక బూటకమని అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేతలు తయారు చేసిన నివేదికదని విమర్శించారు. దమ్ముంటే ఆడిట్ కమిటీ సంతకం చేసిన నివేదికను బయట పెట్టాలని సవాల్ విసిరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/