డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..?

తెలంగాణ లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ ఇప్పటికే 115 సీట్లను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. అటు కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీలు కూడా క్యాండిడేట్ల ఫైనల్ లిస్టును తయారుచేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షెడ్యూల్ తాలూకా ఫ్లెక్సీని కార్యాలయంలో ప్రదర్శనకు కూడా ఉంచారు.

తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం నవంబర్ 12 ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తారు. తర్వాత నవంబర్ 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసాక నవంబర్ 22న తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారు. దీనినే ఫార్-7ఏ అని కూడా అంటారు. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయి. అక్కడి నుంచి మరో నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ 11 ఓట్లను లెక్కిస్తారు. ప్రస్తుతానికి దీనిని తాత్కాలిక షెడ్యూల్ అనే చెబుతున్నా…దీనినే ఫైనల్ చేస్తారని కూడా తెలుస్తోంది. 2018లో తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ కూడా ఇదే.