ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈ నెల 11 టిఆర్ఎస్ పార్టీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై చర్చయించనున్నారు. అలాగే కొత్త పెన్షన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్ చర్చించనుంది.

శాసనసభ ప్రత్యేక సమావేశం, స్థానికసంస్థల సమావేశాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. వీటితోపాటు పాలనాపరమైన అంశాలు, రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నిక, పార్టీ వ్యూహం, సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.