రాజధాని ఢిల్లీలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Delhi Fire News Massive Fire Erupts At Factory In Bawana

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ పరిశ్రమలోని ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. ఇంతలోనే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీ అంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫ్యాక్టరీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. 26 ఫైరింజన్‌ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.