ఓటిటి లో సందడి చేసేందుకు సిద్దమైన “రంగ రంగ వైభవంగా”

వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఉప్పెన తో సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీ లోకి మెగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..ఆ తర్వాత కొండపోలం మూవీ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు మూడో చిత్రం రంగరంగ వైభవంగా అంటూ సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గిరీశయ్య రంగరంగ మూవీకి దర్శకత్వం వహించాడు.

రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి ఆటతోనే ప్లాప్ టాక్ సొంతం చేసుకుని వారం రోజులు తిరగకముందే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మూవీ దసరా సందర్బంగా అక్టోబర్ 02 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మరి థియేటర్స్ లో సందడి చేయలేకపోయినా ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.