దసరా సెలవుల్లో స్వల్ప మార్పులుః ఏపీ ప్రభుత్వం

ap logo
ap logo

అమరావతిః ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీని సాధారణ సెలవుగా, 24వ తేదీని ఆప్షనల్ హాలిడేగా ఇంతకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా 24వ తేదీని ఆప్షనల్ హాలిడే బదులు సాధారణ సెలవుగా మార్చింది. దీంతో 23, 24 రెండు తేదీలు సాధారణ సెలవుగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో విద్యాసంస్థలు తిరిగి 25వ తేదీన తెరుచుకోనున్నాయి.