దేశంలో కొత్తగా 8,503 కరోనా కేసులు
మొత్తం మరణాల సంఖ్య 4,74,735
corona virus – india
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న కరోనా నుంచి 7,678 మంది కోలుకున్నారని తెలిపింది. కరోనాతో నిన్న 624 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్రస్తుతం కరోనాకు 94,943 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది.
కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 3,41,05,066 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో కరోనా వల్ల మొత్తం 4,74,735 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 131,18,87,257 వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు వివరించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/