మరోసారి ఏపీకి వ‌ర్ష సూచ‌న‌

నేడు, రేపు కూడా తేలికపాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

అమరావతి: ఏపీని వ‌ర్షాలు వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర‌ద‌లు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం కూడా ఏదో ఒక జిల్లాలో వ‌ర్షాలు ప‌డుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నేడు, రేపు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. ఏపీ తీర ప్రాంతాల్లో స‌ముద్ర మ‌ట్టానికి 0.9 కిలోమీట‌ర్ల ఎత్తులో ద్రోణి వ్యాపించింద‌ని వివ‌రించారు. ఈ కార‌ణంగానే వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/