చర్చలకైనా ఘర్షణలకైనా సిద్ధంగా ఉండాలి
Kim Jong Un
సియోల్: అమెరికాతో చర్చలకైనా ఘర్షణలకైనా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ముఖ్యంగా ఘర్షణలకు దిగేందుకే ఎక్కువగా తయారవ్వాలని సూచించారు. గురువారం జరిగిన సమావేశంలో కిమ్ ఈ ఆదేశాలిచ్చినట్టు ప్రభుత్వ మీడియా శుక్రవారం వెల్లడించింది. ఉత్తరకొరియా అణుకార్యక్రమంపై ఆ దేశానికి అమెరికాకు మధ్య సంబంధాలు ఉప్పునిప్పుగా ఉన్న విషయం తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/