తగ్గిన ఆర్జేడీ కూటమి ఆధిక్యత

ముందంజలోకి ఎన్డీయే

Counting hall
Counting hall

Patna: బీహార్ కౌంటింగ్ సాగే కొద్దీ ఎన్డీయే పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నది.

తొలి దశలో భారీ ఆధిక్యంలో దూసుకు వెళ్లిన ఆర్జేడీ కూటమి కౌంటింగ్ కొనసాగే కొద్ది ఆధిక్యత కోల్పోతూ వస్తున్నది.

తొలి దశలో సింపుల్ మెజారిటీకి అవసరమైన స్థానాలను ఆర్జేడీ తేలికగా కైవసం చేసుకుంటుందని పించేలా ఆధిక్యతలు వచ్చాయి.

అయితే కౌంటింగ్ కొనసాగే కొద్దీ అవి తగ్గడమే కాకుండా ఎన్డీయే పుంజుకుని ముందంజలోకి వచ్చింది.

కడపటి వార్తలందే సరికి బీహార్ లో 130 స్థానాల్లో ఎన్డీయే, 101 స్థానాలలో ఆర్జేడీ ఆధిక్యంలో ఉన్నాయి.

ఇక ఎల్జీపీ నాలుగు స్థానాలలోనూ, ఇతరులు ఎనిమిది స్థానాలలోనూ ఆధిక్యంలో ఉన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/