కిరణ్ అబ్బవరం మీటర్‌ టాక్ ..

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్..ఇప్పుడు మీటర్ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్లాప్ – మైత్రీ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాను చూసిన అభిమానులు , ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం అదరగొట్టాడని .. లుక్స్‌ కూడా చాలా బాగున్నాయని, పోలీస్‌ పాత్రలో ఒదిగిపోయాడని అంటున్నారు. ఫస్ట్‌ ఆఫ్‌లో కామెడీ బాగానే పేలిందని, డైలాగ్స్‌ కూడా బాగున్నాయని వెల్లడిస్తున్నారు. అయితే సినిమా ప్లాట్‌ మాత్రం రొటీన్‌గా ఉందని, సినిమా చూస్తుంటే కళ్యాణ్‌రామ్‌ పటాస్‌, శర్వానంద్‌ రాధా సినిమాలు గుర్తుకువస్తాయని తెలుపుతున్నారు. రన్‌ టైమ్‌ తక్కువగా ఉండటం ఈ సినిమాకు కలిసి వచ్చిందని, ఓవరాల్‌గా మీటర్‌ యావరేజ్‌ బొమ్మ అని చెబుతున్నారు. ఓవరాల్ గా మీటర్ కు మిక్సెడ్ టాక్ వస్తుంది.