వరుసగా మరణిస్తున్న శునకాలు

భయాందోళనలో స్థానికులు

died dog
died dog

పెద్దపల్లి: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఒడేడ్‌ గ్రామంలో ఒక్కరోజు వ్యవధిలోనే ఏకంగా 12 శునకాలు మరణించాయి. దీనితో స్థానికుల్లో భయాందోళను అలుముకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తుడడంతో శునకాలకు కూడా కరోనా సోకిందేమో అని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు పశువైద్యాదికారి హన్నన్‌ తెలిపారు. కాగా గ్రామంలో కరోనా వైరస్‌ నివారణ కోసం అధికారులు ఇటీవలే రసాయనాలను పిచికారి చేశారు. ఈ పిచికారి చేసిన ఆహరాన్ని తినడం వల్ల, లేదా నీటిని తాగడం వల్ల కాని శునకాలు మరణించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. పోస్టుమార్టం చేసి నిర్ధారించుకుంటామని అధికారులు వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/