డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల డేటా చోరీ..!

స్వతంత్ర దర్యాప్తు సంస్థ ప్రకటన

Debit and credit card data theft ..!
Debit and credit cards

ముంబై,: క్రెడిట్‌, డెబిట్‌కార్డుదారులకు హెచ్చరిక. బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న డిజిటల్‌ చెల్లింపుల సంస్థ జస్‌పే నుంచి 10 కోట్ల మంది భారతీయుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు దొంగిలించినట్లు స్వతంత్ర దర్యాప్తు సంస్థ ప్రక టించింది. ఈ డేటాను క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ రూపంలో పెద్ద మొత్తానికి డార్క్‌ వెబ్‌కు విక్రయించినట్లు పేర్కొంది.

టెలిగ్రామ్‌ ద్వారా కూడా హ్యాకర్స్‌ ఈ డేటాను సేకరించారని తెలుస్తోంది. దాదాపు 10 కోట్ల మంది క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డు హోల్డర్ల డేటా తస్కరించి నట్లు సదరు ఇండిపెండెంట్‌ సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చర్‌ తెలిపారు. సైబర్‌ దాడి నేప థ్యంలో కార్డు నంబర్లు లేదా ఆర్థిక పరమైన సమాచారానికి వచ్చిన ఢోకాలేదని, డేటా లీకైన కార్డు హోల్డర్ల సంఖ్య 10కోట్లలోపు ఉంటుందని జస్‌పే తెలిపింది.

గత ఏడాది ఆగస్ట్‌ 18న అనధికారికంగా తమ సర్వర్లపై దాడి జరిగినా, వెంటనే నిరోధిం చినట్లు తెలిపింది. ఆ సమయంలో కార్డు హోల్డర్లకు సంబంధించిన సమా చారం బయటకు వెళ్ల లేదని పేర్కొంది. పది కోట్ల మంది సమాచారం లేదని, కార్డుహోల్డర్ల ఇ-మెయిల్‌, ఫోన్‌ నంబర్లు మాత్ర మే బయటకు వెళ్లినట్లు తెలిపింది. అయితే డేటాను డార్క్‌ వెబ్‌లో క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ ద్వారా విక్రయిస్తు న్నట్లు కూడా తెలిపింది.

ఈ ఏడాది కోసం హ్యాకర్లుటెలిగ్రాం ద్వారా కూడా సంప్రదిస్తు న్నట్లు వెల్లడించారు. కార్డు సమాచారాన్ని స్టోర్‌ చేసేం దుకు జస్‌పే పిసిఐ డిఎస్‌ఎస్‌ (పేమెంట్‌ కార్డు ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్‌)ను వినియో గించినట్లు తెలిపారు.

కాగా, కార్డు ఫింగర్‌ ప్రింట్స్‌ జనరేట్‌ చేసేందుకు హ్యాకర్లు హ్యాష్‌ ఆల్గారిథంను ఉప యోగిస్తే మాత్రమే దీనిని డిక్రిప్ట్‌ చేయ డం సాధ్యమవుతుందని సైబర్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వినియోగదారుల పేరు, మొబైల్‌ నంబర్‌, ఇ-మెయిల్‌ ఐడి, బ్యాంకు పేరు, చెల్లింపులు, కార్డు రకం, కార్డు బ్రాండ్‌, కార్డు ముగింపు తేదీ, చివరి నాలుగు నంబర్స్‌, కార్డుదారుడి పేరు, వేలి ముద్రలు ఇలా పలు వివరాలు బహిర్గ తమైనట్లుగా చెబుతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/