రికార్డు స్థాయికి బిఎస్‌ఇ టర్నోవర్‌

మరో సరికొత్త రికార్డు

BSE turnover to record level
BSE turnover to record level

ముంబై: ఇటీవల రికార్డుల బాటలో సాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ల కారణంగా మరో సరికొత్త రికార్డు ఆవిష్కృతమైంది. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 2623 పాయింట్లు పెరిగింది. మార్కెట్‌ చరిత్రలో సోమవారం తొలిసారి 48వేల పాయింట్ల మార్క్‌ను అధిగమించింది.

ఈ నేపథ్యంలో బిఎస్‌ఇలో లిస్టయిన కంపె నీల మార్కెట్‌ విలువ 12,89,863 కోట్లరూపాయలకుపైగా జత కలి గింది. వెరసి బిఎస్‌ఇ మార్కెట్‌ విలువ అంటే లిస్టెడ్‌ కంపెనీల విలువ తొలిసారి రూ.191 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఈ విలువ డాలర్లరూపేణా 2.6 లక్షల కోట్లకు సమా నం కావడం గమనా ర్హం.

కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తుండ డం ప్రధానం గా మార్కెట్ల కు జోష్‌ని స్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

గత రెండు నెలల్లోనే ఎఫ్‌పిఐలు దేశీయ స్టాక్స్‌లో ఏకంగా 14 బిలియన్‌ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలిపారు. దీనికి తోడు ఇటీవల దేశీయంగా రెండు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో సెంటిమెంటు బలపడిందని తెలియ చేశారు.

డిసెంబర్‌లో రికార్డుస్థాయిలో జిఎస్‌టి వసూళ్లు నమోదు కావడం, ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా రికవరీ అవుతున్నట్లు ఆర్‌బిఐ నివేదిక తాజాగా అబిప్రాయపడడం వంటి పలు సానుకూల అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సా హానిస్తున్నట్లు వివరించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/