దలాల్‌ స్ట్రీట్‌లో రెండోరోజూ లాభాలే

సూచీలన్నీ జీవనకాల గరిష్టం

Dalal Street
Dalal Street

ముంబయి: బుల్స్‌ మార్కెట్లలో మళ్లీ రన్‌తీసాయి. వారంలో రెండోరోజు మార్కెట్లు లాభాల్లోముగిసాయి. అనిశ్చితి స్థితిని గట్టెక్కాయి. బెంచ్‌మార్క్‌ సూచీలన్నీ కూడా జీవనకాల గరిష్టానికి నమోదుచేసాయి. టెక్నాలజీ షేర్లు సూచీలకు మద్దతిచ్చాయి.

0.5శాతం పెరిగాయి. గ్లోబల్‌పరంగా యుకెప్రభుత్వం 6.2 బిలియన్‌డాలర్ల ఉద్దీపనలనుప్రకటించడం కూడా దేశీయ మార్కెట్లకు కొంత మద్దతిచ్చింది. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ మందకొడితనం నుంచి రికవరీదిశగా వచ్చాయి. 48,486.24 పాయింట్లకు చేరింది. 261 పాయింట్లుపెరిగి 48,438 పాయింట్లకు చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి జంట సంస్థలు,యాక్సిస్‌బ్యాంకు, టిసిఎస్‌, ఐసిఐసిఐబ్యాంకులు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టాయి.

యాక్సిస్‌బ్యాంకు టాప్‌సెన్సెక్స్‌లాభాల్లోఆరుశాతం పెరిగాయి. హెచ్‌డిఎఫ్‌సి 2.7శాతం, ఇండస్‌ఇండ్‌బ్యాంకు 2.7శాతం, టిసిఎస్‌ 1.7శాతంచొప2నపెరిగాయి. ఇక బజాజ్‌ఫైనాన్స్‌ 1.5శాతం క్షీణించింది. రిలయన్స్‌ఇండస్ట్రీస్‌ 1.2శాతం లాభపడింది. బజాజ్‌ఫిన్‌సెర్వ్‌ ఒకటిశాతం నష్టపోయి లాభాలను కట్టడిచేసింది.

ఇక నిఫ్టీ 50సూచీలో 66.6పాయింట్లులాభపడి 14,215.6 పాయింట్ల వద్ద ముగిసింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ సూచీ 1.4శ3ఆతం చొప్పుపెరిగింది. స్మాల్‌క్యాప్‌సూచీ 0.7శాతం లాభపడినట్లు తేలింది. ఆసియా మార్కెట్లు దిగువస్థాయిలోనేమంగళవారం ముగిసాయి. జార్జియా సెనేట్‌ రనాఫ్‌కూడా కొంతకీలకం అయింది.

ఆసియా పసిఫిక్‌సూచీలు జపాన్‌ బయట ప్రాంతంలో 0.95శాతం చొప్పున లాభపడ్డాయి. ఆస్ట్రేలియా స్టాక్స్‌ 0.26శాతం చొప్పున లాభపడ్డాయి. చైనా కంపెనీలషేర్లు తొలినాళ్లలోని నష్టాలను కట్టడిచేసుకుని 0.52శాతం లాభపడ్డాయి. జపాన్‌షేర్లు 0.34శాతం లాభపడ్డాయి.

యూరోప్‌ స్టాక్స్‌ రక్షనాత్మకంగాపనిచేసాయి. చమురు, రిటైల్‌స్టాక్స్‌పరంగా పాన్‌యూరోపియన్‌స్టాక్స్‌600 సూచీ 0.2శాతం దిగజారినట్లు తేలింది. బిఎస్‌ఇలో 1784 కంపెనీలషేర్లుపెరిగాయి. 1283 షేర్లు నష్టపోగా 166 కంపెనీలషేర్లుస్థిరంగా ట్రేడింగ్‌కొనసాగించాయి. విదేశీపోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 1843.22 కోట్లవిలువైన వాటాలను కొనుగోలుచేసారు.

దేశీయ సంస్థాగత ఇన్వెస్టరుల 715.21కోట్ల విక్రయాలు జరిపారు. విదేశీ మార్కెట్లపరంగా అమెరికా డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 30 సూచీ 85 పాయింట్లుపెరిగింది.

అమెరికా మార్కెట్లకు సానుకూలంగా మారింది. జర్మనీ కూడా తన లాక్‌డౌన్‌ను కొంతమేర పెడిగిస్తుందని అంచనావేసింది. అమెరికా అధ్యక్షుడు జోబిడెన్‌ ఆర్థిక విధానాలకు సంబంధించి కొంతమేర జార్జియా ప్రభావం చూపిస్తుందని పరిశీలకులు అంచనావేస్తున్నారు. మొత్తంగాచూస్తే మార్కెట్లపరంగా వారంలో రెండోరోజు కూడా లాభాల్లోనేముగిసాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/