1600 కు చేరిన కొవిడ్-19 మృతులు

బీజింగ్: కొవిడ్-19 వైరస్ బారినపడి చైనాలో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజూకు పెరుగుతుంది. కొవిడ్-19 కారణంగా శనివారం 143 మంది మృతిచెందగా, మరో 2,641 కొత్త కేసులు నమోదైనట్టు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. హుబే ప్రావిన్సుల్లోని 56 మిలియన్ల జనాభా నిర్బంధం కొనసాగుతోంది. ఈ ప్రావిన్సుల్లోని ప్రజలతో దేశంలోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. తాజా మరణాలతో కొవిడ్-19 సంఖ్య 1,600కు చేరింది. 66,000 మందికిపైగా బాధితుల ఉన్నట్టు తేలింది. వుహాన్ నగరంలో గతేడాది డిసెంబరు చివరిలో వెలుగుచూసిన కొవిడ్-19 ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం 28 దేశాలకు విస్తరించింది. శనివారం నాడు ప్రాణాలు కోల్పోయిన 143 మంది హుబే ప్రావిన్సులకు చెందినవారేనని అధికారులు పేర్కొన్నారు. దాదాపు 20 రోజుల నుంచి హుబే ప్రావిన్సుల్లోని పలు నగరాల్లో ప్రజా రవాణ పూర్తిగా నిలిపివేశారు. చైనా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, పలు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. అతి కొద్ది శాతం మంది మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/