జనసేనాధినేత ఫై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసారు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారని… దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. విశాఖ ఘటనతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు యత్నించారని… పవన్ కల్యాణ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలను తీసుకోవాలని తమ ఫిర్యాదులో కమిషన్ ను కోరామని తెలిపారు.

ఇదిలా ఉంటె విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పట్ల ప్రభుత్వం ఇద్దరు సీఐలపై బదిలీ వేటువేసింది. మంత్రులు ఈ నెల 15న నగరానికి వచ్చిన సందర్భంగా విమానాశ్రయం వద్ద విధుల్లో ఉన్న కంచరపాలెం సీఐ పీవీఎస్ఎన్ కృష్ణారావు, ఎయిర్‌పోర్టు స్టేషన్ సీఐ ఉమాకాంత్‌లను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. వారికి పోస్టింగులు కూడా ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వు (వీఆర్)కు పంపింది.