పువ్వాడ ఫై దాసోజు శ్రవణ్ ఫైర్

పోలవరం ఎత్తుపై మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు ఉంది.. పోలవరంతో తెలంగాణ కు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే కానీ ఇన్నేళ్లు గుడ్డి గుర్రం పళ్ళు తోమినారా?”. అంటూ సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేశారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని అలాగే ఏపీలో విలీనం అయిన అయిదు గ్రామాలను తెలంగాణ‌లో కలపాలని మంత్రి పువ్వాడ అజయ్ ఏపీ సర్కార్ ను అలాగే కేంద్రాన్ని కోరారు. పువ్వాడ చేసిన వ్యాఖ్యల ఫై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ , అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు ఎలా తగ్గిస్తారు..విలీనమైన గ్రామాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంతే భద్రాచలం మాకు ఇస్తారా..హైదరాబాద్ ఏపీలో కలుపుతారా అంటూ వారు ప్రశ్నించారు.

ప్రస్తుతం దీనిపై ఇరు రాష్ట్ర నేతలు కామెంట్స్ వేస్తుండగా..తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పువ్వాడ వాఖ్యలపై మండిపడ్డారు. ‘దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు ఉంది.. పోలవరంతో తెలంగాణ కు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే కానీ ఇన్నేళ్లు గుడ్డి గుర్రం పళ్ళు తోమినారా?”. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.