వైస్సార్సీపీ ఎంపీ మాధవ్‌ ను వదిలిపెట్టని టీడీపీ నేతలు

వైస్సార్సీపీ ఎంపీ మాధవ్‌ ను టీడీపీ నేతలు వదిలిపెట్టడం లేదు. రీసెంట్ గా ఓ న్యూడ్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియో లో ఉన్నది ఎంపీ మాధవ్‌ అని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఈ వీడియో లో ఉన్నది ఎంపీ మాధవ్‌ కాదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ దీనిని వదిలిపెట్టడం లేదు టీడీపీ నేతలు. ఒకరు కాకపోతే ఒకరు దీనిపై రచ్చ చేస్తూనే ఉన్నారు.

తాజాగా దీనిపై టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవ్ వ్యవహారంతో ఏపీ ప్రజలు సిగ్గుతో తల దించుకుంటున్నారని.. ఎంపీ పై చర్యలు తీసుకోకుండా సీఎం జగన్ వెనకేసుకొస్తున్నారని ఆగ్రహించారు. ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే మార్ఫింగ్ అని ఎలా తేలుస్తారు..? అని.. మేం అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక తెప్పించామని పేర్కొన్నారు. ఈ నెల 9 న వీడియో పంపించాం.. నిన్న నివేదిక వచ్చిందని వివరించారు. అమెరికాలో ఉండే జిమ్ స్టాఫర్డ్ అనే టెక్నికల్ ఎక్స్పర్ట్ కి పంపించామని.. వీడియో ఎడిటింగ్ చేసింది కాదని ఎక్లిప్స్ ల్యాబ్స్ తేల్చిందని స్పష్టం చేశారు. ఈ ల్యాబ్ అమెరికాలో ఫ్లోరిడాలో చాలా పేరున్న ఫోరెన్సిక్ ల్యాబ్ అని.. ఈ నివేదిక ఆధారంగా ఎంపీపై చర్యలు తీసుకోండని డిమాండ్‌ చేశారు.

ఇక మాధవ్ అనే పోరంబోకును ఎంపీ అని పిలవడానికి నోరు రావడం లేదని.. గలీజు వ్యవహారాన్ని కులానికి ఆపాదించడం సిగ్గు అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం, పోలీసులు మాధవును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. మంత్రులు తిరుపతి కొండపై మాధవ్ వ్యవహారం గురించి మాట్లాడటం మన దౌర్భాగ్య మన్నారు. ఫోరెన్సిక్ నివేదిక పై చర్చించే దమ్ము పోలీసులకు, ప్రభుత్వానికి ఉందా…? ఈ రిపోర్ట్ కూడా కమ్మ వాళ్ళు ఇచ్చారని చెప్తారా…? మాధవ్ నువ్వు మనిషివా..? పశువ్వా…? అని నిప్పులు చెరిగారు.