యూపీలో అమ్మతనానికే మచ్చ తెచ్చే ఘటన

తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కన్నా బిడ్డకు చిన్న గాయమైన తట్టుకోలేదు. అలాంటిది ఓ తల్లి మాత్రం అమ్మతనానికే మచ్చ తెచ్చింది. ఏ తల్లి చేయని పని చేసి అందరి చేత ఛీ అనిపించుకుంది. ఐదేళ్ల కొడుకు స్కూల్ కు వెళ్లానని మారాం చేయడం తో కత్తిని స్టవ్​పై పెట్టి వేడి చేసి శరీరంపై 17 చోట్ల వాతలు పెట్టింది. ఈ ఘటన ప్రదేశ్ గోరఖ్​పుర్​లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

సంత్​ కబీర్​నగర్​కు చెందిన కాంచన, కాలేశ్వర్ లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్లు, 9నెలల వయసున్న చిన్నారులు ఉన్నారు. వీరి ప్రేమ వివాహానికి రాహుల్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం వల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది తమ చిన్నారిని తొలిసారిగా స్థానిక పాఠశాలలో చేర్పించారు. ఎప్పటిలాగే రాహుల్​ పనికి వెళ్లాడు. చిన్నారిని తల్లి పాఠశాలకు వెళ్లమని చెప్పగా.. ఆ చిన్నారి వెళ్లాలని మారాం చేసింది. తల్లి ఎంత చెప్పిన వెళ్లకుండా ఏడుస్తూ ఉండిపోయాడు. దీంతో ఆగ్రహించిన తల్లి చిన్నారి అని కూడా చూడకుండా కత్తిని స్టవ్​పై పెట్టి వేడి చేసి ఆ చిన్నారి శరీరంపై 17 చోట్ల వాతలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం బాలికను పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి తన భార్యపై కేసు పెట్టాడు.