ఆ ఘటన చాలా బాధ కలిగించింది.. సీఎం జగన్

ప్రకాశం బ్యారేజీ వద్ద చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరం.. సీఎం జగన్‌

అమరావతి: ఓ నర్సింగ్ విద్యార్థినిపై ప్రకాశం బ్యారేజి సమీపంలో జరిగిన అత్యాచార ఘటన పట్ల సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటన మనసుకు ఎంతో బాధ కలిగించిందని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి వికృత చర్యలు జరగకుండా ఓ అన్నగా, తమ్ముడి మరింత శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రకాశం బ్యారేజి వద్ద ఘటన జరిగిందని, దీనికి తాము చింతిస్తున్నామని పేర్కొన్నారు. స్త్రీలు అర్ధరాత్రి వేళ కూడా నిబ్బరంగా తిరిగే పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని బలంగా విశ్వసిస్తానని సీఎం జగన్ పేర్కొన్నారు.

మహిళల రక్షణ కోసం దిశ చట్టం కూడా చేశామని, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించామని, 900 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక మీదట ప్రకాశం బ్యారేజి తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/