సుదర్శన్ థియేటర్లో విజయ్ దేవరకొండకు 75 ఫీట్ల భారీ కటౌట్ ఏర్పటు

సుదర్శన్ థియేటర్లో విజయ్ దేవరకొండ అభిమానులు ఏకంగా 75 ఫీట్ల భారీ కటౌట్ ఏర్పటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంతో యూత్ ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ..ఆ తర్వాత గీత గోవిందం తో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆ రెండు భారీ విజయాల తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వీటిలో పెద్దగా విజయం సాధించకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం లైగర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ .. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా గా పలు భాషల్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చార్మీ పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , మేకింగ్ , స్టిల్స్ , సాంగ్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..రేపు జులై 21 ఉదయం 09:30 నిమిషాలకు చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో విజయ్ దేవరకొండకు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. ఏకంగా 75 ఫీట్ల కటౌట్ ను ఏర్పటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.