రేవంత్ రెడ్డి తో సబర్మతీ ఆశ్రమంలోని మరుగుదొడ్లు శుభ్రం చేయించాలి – దాసోజు శ్రవణ్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సబర్మతీ ఆశ్రమంలోని మరుగుదొడ్లు శుభ్రం చేయించాలని అప్పుడే బుద్ది వస్తుందని అన్నారు బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేద ప్రజలను హీనమైన పదజాలంతో దుర్భాషలాడడం, అందరినీ కించపరచడం, ఏదిపడితే అది అనడం చేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి కి మహాత్మాగాంధీ సిద్ధాంతాలు కానీ , కాంగ్రెస్ పార్టీ మార్గదర్శ సూత్రాలు కానీ తెలుసా అని శ్రవణ్ ప్రశ్నించారు.

గాంధీ కాలంలో ఎవరైనా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి బాపు… మీ శిష్యునిగా ఉంటూ..స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటా అని అంటే..ముందుగా వారిచేత టాయిలెట్స్ కడిగించేవారు..ఆలా ఒకటి , రెండుసార్లు కాదు మూడు , నాల్గు సార్లు కడిగించిన తర్వాత..సబర్మతీ ఆశ్రమంలో అన్ని పనులు చేసావు కాబట్టి సమాజంలో అంతకంటే పేరుకుపోయిన మురికిని శుభ్రం చెయ్యి అని స్వాతంత్ర ఉద్యమంలో చేర్చుకునేవారు మహాత్మా గాంధీ. అలాంటి సిద్దాంతం కాంగ్రెస్ పార్టీది , మహాత్మా గాంధీది. కానీ రేవంత్ లాంటి గాడ్సే కు మహాత్మా సిద్ధాంతం అర్ధం కావడం లేదు.ముందు రేవంత్ రెడ్డి సబర్మతి ఆశ్రమం లో టాయిలెట్స్ ను కడిగించాలని..ఆలా కడిగించి తర్వాత టీపీసీసీ పదవిలో కూర్చుపెట్టాలని , అప్పుడే రేవంత్ కు పారిశుధ్య కార్మికులను, అట్టడుగు వర్గాలను ఎలా గౌరవించాలో నేర్చుకుంటాడని శ్రవణ్ అన్నారు.