పవన్ పర్యటనలను జనాలు పట్టించుకోవడం లేదన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పలు విమర్శలు చేసారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న జనాలు పట్టించుకోవడం లేదని , అసలు పవన్ కళ్యాణ్ కు ఓటు ఎవరైనా వేస్తారా అని ప్రశ్నించారు. వాలంటీర్ల వల్ల రాష్ట్ర ప్రజలకు చెందిన కీలక వివరాలు దుర్వినియోగం అవుతున్నాయన్న పవన్ ఆరోపణలను ఖండించారు.

వాలంటీర్లు 5000 రూపాయల గౌరవ వేతనం తీసుకొని సేవలు చేస్తున్నారని.. వాళ్ల వల్ల డేటా చౌర్యం జరుగుతుందన్నడం సరికాదన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎవరు ప్రశ్నించలేదని అన్నారు. ఏపీలో కుళ్ళి కుషించిపోయిన టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. అసలు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని అన్నారు.