దసరా రెండు వారాల కలెక్షన్స్ ..

నాని – కీర్తి సురేష్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన దసరా మూవీ మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. విడుదల రోజు నుండి ఇప్పటివరకు అనేక చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది;. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే పలు రికార్డ్స్ బ్రేక్ చేస్తూవస్తుంది. తాజాగా 2 మిలియన్ మార్క్ సాధించింది.

ఇదిలా ఉంటె ఈ మూవీ రెండు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 43.31 కోట్ల షేర్ కలెక్షన్స్ 72.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో చూసుకుంటే 4.62 కోట్ల వరకు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో మాత్రం 10.42 కోట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల్లో దసరా సినిమా 61.82 కోట్ల షేర్ కలెక్షన్స్ 111 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.