ఓటిటి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..దసరాలో ఆ సీన్లతో స్ట్రీమింగ్

నాని – కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ దసరా. భారీ అంచనాల నడుమ మార్చి 30 న పాన్ ఇండియా గా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాని – కీర్తి నటనకు యావత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్..ఈరోజు నుండి స్ట్రీమింగ్ మొదలుపెట్టింది. ఇందులో సెన్సార్ బోర్డ్ కట్ చేసిన సీన్స్‌తో పాటు కొన్ని మ్యూట్ చేసిన డైలాగులను కూడా యాడ్ చేయడం విశేషం. ఇక, ఈ చిత్రం హిందీ వెర్షన్ మాత్రం హాట్‌స్టార్‌గా స్ట్రీమింగ్ కాబోతుంది.