ఏజెంట్ కు షాక్ ఇచ్చిన సెన్సార్..కీలక సన్నివేశాలను లేపేశారు

అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ రేపు గ్రాండ్ గా విడుదల కాబోతుంది. చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టి చాలాకాలం అవుతున్న ఇంతవరకు అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు. అఖిల్ నటించిన గత చిత్రం మోస్ట్ బ్యాచ్లర్ సైతం యావరేజ్ తోనే సరిపెట్టుకుంది. దీంతో ఏజెంట్ మూవీ ఫై అందర్నీలో ఆశలు పెరిగాయి.

ఈ చిత్రంలో అఖిల్ ఇండియ‌న్ సీక్రెట్ ఏజెంట్‌గా బీస్ట్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే 8 ప్యాక్ బాడీ లుక్‌తో వావ్ అనిపిస్తున్నాడు అఖిల్‌తో పాటు మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఇందులో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. ఏజెంట్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి సెన్సార్ బృందం షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఏజెంట్ సినిమాపై 8 చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెగ్యులేటరీ గైడ్ లైన్స్ కు అనుగుణంగా లేకపోవడంతో సినిమాలోని కొన్ని బూతు పదాలను మ్యూట్ చేశారు. అంతేకాకుండా ప్రేక్షకులపై ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్ పడకుండా రెండు వయెలన్స్ సీన్లను బ్లాక్ చేశారట. ఈ సినిమాలో ప్రధానంగా నిలిచే యాక్షన్ సీన్స్ ఇలా బ్లాక్ చేయడం ఏజెంట్ కు ఎలాంటి రిజల్ట్ ఉంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ రాగా 156 నిమిషాలుగా నిడివి ఉంది.