వాలెంటెన్స్ డే స్పెషల్ గా దసరా నుండి హార్ట్ బ్రేక్ ఆంథమ్ సాంగ్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు మేకర్స్. ఇప్పటికే సినిమాలోని ఫస్ట్ సాంగ్ ధూమ్..ధామ్ సాంగ్ , టీజర్ విడుదల చేసిన మేకర్స్…వాలెంటెన్స్ డే స్పెషల్ గా దసరా నుండి హార్ట్ బ్రేక్ ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.

రేపు ఫిబ్రవరి 9 సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా హీరో నాని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ పోస్టర్ లో ఒక పాత కాలం నాటి సైకిల్ దానికి బ్రేక్ అయిన గ్లాస్ తో ఉన్న కళ్ళజోడు తగిలించి ఉంది. ఇంట్రెస్టింగ్ థీమ్ తో పోస్టర్ ను చిత్ర యూనిట్ ఆవిష్కరించడం విశేషం.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. నాని కెరీర్‌లో ఇది వరకు చేయని ఓ పక్కా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా ఇదే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇస్తుండగా , సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.