సార్ మూవీ ట్రైలర్ రిలీజ్

ధనుష్ హీరోగా నటిస్తున్న సార్ మూవీ నుండి ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. తెలుగు లో ‘సార్‌’ / ‘వాతి’ (తమిళం) గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై యువ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. రెండు భాషల్లోను ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రొమోషన్ భాగంగా బుధువారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ‘ఎవర్ సార్ ఆయనా.. నా గురువు బాలు సార్అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ దేశంలో ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటల్ సర్వీస్.. త్రిపాఠీ ఇనిస్టిట్యూషనల్ తరుపున కొన్ని గవర్నమెంట్ కాలేజీలని దత్తత తీసుకున్నాం. అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకున్నాం. మీరు కాలేజీకి ఏదో మంచి చేస్తారనిపిస్తోంది. అందుకే వెల్కమ్ టు ద కాలేజ్అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి..డబ్బులున్న వాడే ఈ లెక్కని కొంటాడు..తక్కువున్న వాడు అప్పుచేసైనా కడతాడు… దయచేసి నువ్వు రాజకీయాల్లోకి మాత్రం రాకయా.. ఎడ్యుకేషన్ లో వచ్చే డబ్బు రాజకీయాల్లో రాదు.. వాళ్లు గెలిచా మనుకున్నారు…` అంటూ సాగే డైలాగ్స్ బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓవరాల్ గా సార్ ట్రైలర్ సినిమా ఫై మరింత అంచనాలు పెంచేలా ఉంది.

తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం తో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీ లో సముద్రఖని సాయి కుమార్ తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

YouTube video