దసరా మూవీలో డిలీటెడ్ సీన్ ను రిలీజ్ చేసిన మేకర్స్

నాని – కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దసరా. పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆట తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

తాజాగా ఈ మూవీ లోని డిలీటెడ్ సీన్ ను మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని వెన్నెల ఆవేదన చూపించారు.. సీన్ లోకి వెళ్తే.. ”నిన్నే అంత కాని దాన్ని అయిపోయానా ఆడెవడో వచ్చి తాళి కడతా అంటే ఆపేది పోయి.. ఇంకా మీదకెళ్ళి తీస్కపో అని చెప్పి నన్ను వదిలించుకున్నాం. నువ్వసలు తల్లివేనా.?”.. అందరూ కూడా నా బతుకును ఎట్లా చేసిర్రో చూశినవా అని అత్త ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తుంది వెన్నెల. వెంటనే ఆమె అత్త వెన్నెలను తన అత్తారింటి ముందుకు తీసుకెళ్లి గిదే నీ ఇళ్లు, ఈడ్నే నీ బతుకు. నా మాట విని లోపలికి పోవే.. నీ భాంచేనే.. వన్ టూ వెన్నెలను బతిమలాడుకొని వెళ్ళిపోతుంది. కానీ అక్కడే ఏడుస్తూ నిలబడిపోతుంది వెన్నెల.

అయితే వీరి సంభాషణనంతా అక్కడే గోడ వెనుక ఉన్న ధరణి వింటుంటాడు” ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఇంత అద్భుతమైన సీన్ ఎందుకు డిలీట్ చేశారు అంటూ అభిమానులు ప్రశిస్తున్నారు.

YouTube video