ప్రభుత్వ మద్య విధానాన్ని విమర్శిస్తూ పవన్‌ కల్యాణ్‌ కార్టూన్

అంతా తాగేవాడి ఇష్టం అంటూ సెటైరికల్ కార్టూన్

Pawan kalyan
Pawan kalyan

అమరావతిః జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో సారి ఏపి సర్కార్‌ పై విమర్శలు గుప్పించారు. మద్యంపై వైఎస్‌ఆర్‌సిపి అనుసరిస్తున్న విధానాన్ని విమర్శిస్తూ ఉన్న ఒక కార్టూన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘మద్యం మిధ్య.. నిషేధం మిధ్య.. తాగమని, తాగొద్దని చెప్పడానికి మనమెవరం.. అంతా వాడిష్టం’ అంటూ ఒక పేద మహిళకు హితబోధ చేస్తున్నట్టు కార్టూన్ లో ఉంది.

నిన్నటి వరకు ఏపీ రోడ్ల దుస్థితిని కార్టూన్ ఇమేజీల ద్వారా ఎండగట్టిన పవన్ కల్యాణ్… ఇప్పుడు మద్య నిషేధంపై కార్టూన్ల ద్వారా విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి మేనిఫెస్టోలో మద్య నిషేధమే లేదంటూ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కార్టూన్ ను రూపొందించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/