నేడు వ్యాక్సిన్‌ పురోగతిపై ప్రధాని మోడి సమీక్ష

మరో మూడు సంస్థలతో ప్రధాని భేటి

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు కరోనా వ్యాక్సిన్‌ పురోగతిపై మరో మూడు సంస్థలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం వర్చుల్‌గా సాగుతుందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంలో పాలు పంచుకుంటున్న జెన్నోవా బయోఫార్మా, బయోలాజికల్ఈ, డాక్టర్ రెడ్డీస్‌ సంస్థలతో ప్రధాని భేటీ కానున్నారు.

కాగా, కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రధాని శనివారం మూడు నగరాలల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఇండియా సంస్థలను సందర్శించి, వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/