నగ్న ఫొటోలు అంటూ బెదిరించి డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాడు

ఇటీవల సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యువత ను టార్గెట్ చేస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు. లోన్ల పేరుతో , నగ్న ఫొటోస్ పేరుతో ఫోన్లు చేసి బెదిరించడం , డబ్బులు కొట్టేయడం చేస్తున్నారు. దీంతో చాలామంది సైబర్ కాల్స్ కు భయపడి అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కూసుమంచి లో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. మండలంలోని ఓ యువకునికి ఈనెల 13న ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.

లోన్ చెల్లించాలని లేకపోతే మార్ఫింగ్ చేసిన నీ నగ్న ఫోటోలను తన అన్నీ వాట్సప్ నంబర్లకు పంపిస్తానని బెదిరించాడు. ఆ తర్వాత నగ్న చిత్రాలు ఇవేనంటూ ఓ లింక్ పంపించడంతో ఆ యువకుడు ఓపెన్ చేయగా తన అకౌంట్ లో ఉన్న రూ.23,500 డెబిట్ కాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.