తాజ్ మహల్ ఎంట్రీ చార్జీలు పెంపు

ఆగ్రా : తాజ్‌మహల్‌ సందర్శనం మరింత ప్రియం కానుంది. ప్ర‌స్తుతం భార‌త ప‌ర్యాట‌కులు రూ. 50, విదేశీ ప‌ర్యాట‌కులు రూ. 1100 చెల్లించి తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శిస్తున్నారు. అయితే ప్ర‌స్తుత‌మున్న రేట్ల‌ను రూ. 50 నుంచి రూ. 80కి, రూ. 1100 నుంచి రూ. 1200ల‌కు పెంచ‌డం జ‌రిగింది. మెయిన్ డోమ్‌ను చూడాల‌నుకునే వారి నుంచి పై ఛార్జీలు కాకుండా, ఆర్కియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా అద‌నంగా రూ. 200 వ‌సూలు చేస్తుంది. దీనికి అద‌నంగా ఆగ్రా డెవ‌ల‌ప్‌మెంట్ ఆథారిటీ కూడా మ‌రో రూ. 200ల‌ను వ‌సూలు చేయ‌నుంది. మొత్తంగా తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శించాల‌నుకునే స్వ‌దేశీ ప‌ర్యాట‌కులు రూ. 480, విదేశీ ప‌ర్యాట‌కులు రూ. 1600 చెల్లించాల్సి ఉంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/