సీవీఎల్‌ నరసింహరావు సంచలన నిర్ణయం..షాక్ లో సినీ ప్రముఖులు

‘మా’ అధ్యక్ష పోటీ నుంచి వైదొలుగుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నరసింహరావు ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొని సినీ ఆర్టిస్టులకు షాక్ ఇచ్చారు. ‘మా’ సభ్యత్వం తో పాటూ , భాజాపా సినిమా సెల్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ‘మా’ ఎన్నికలు అనే పరీక్ష రాయకముందే ఫెయిల్‌ అయ్యానని తెలిపారు.

‘దివంగత నటుడు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దర్శకుడు దాసరి నారాయణరావు.. అందరి ఆశీస్సులు ఉన్నాయి. కచ్చితంగా ఈ ఎన్నికలు హాయిగా ముందుకు సాగుతాయి. ఒకవేళ అలా జరగకపోతే ‘మా’కి రాజీనామా చేస్తా. ఇందులో సభ్యుడిగా కొనసాగను. ఇలాంటి గందరగోళ, దరిద్రమైన పరిస్థితులకి నేనూ దోహదం చేశాను కాబట్టి ఇకపై ఓటు వేయను. బురదలో ఉన్నా వికసించడానికి నేను కమలాన్ని కాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న ఈయన మంచు విష్ణు కు సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది. ఇంతలోపే రాజీనామా చేయడం..ఓటు వేయనని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.