దేశంలో కొత్తగా 19,740 క‌రోనా కేసులు

మొత్తం రిక‌వ‌రీల సంఖ్య‌ 3,32,48,291

న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ క‌రోనా కేసులు 20 వేల‌ దిగువ‌కు చేరాయి. నిన్న 19,740 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 206 రోజుల క‌నిష్ఠానికి చేరింది. ప్ర‌స్తుతం 2,36,643 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు.

నిన్న 23,070 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రిక‌వ‌రీల సంఖ్య‌ 3,32,48,291కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 58.13 కోట్ల క‌రోనా టెస్టులు చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/